Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్పెషల్ ప్యాకేజీకి చట్టబద్ధత అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తిన కేశినేని నాని

ఆంధ్రప్రదేశ్ కు ఇస్తామన్న స్పెషల్ ప్యాకేజీ అంశాన్ని టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తారు. గతంలో ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారని... ఆ తర్వాత నీతి అయోగ్ ఒప్పుకోలేదంటూ దాన్ని పక్కన పెట్టేశారని ఈ సందర్భంగా కేశినేని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పారని... అయితే, ఎప్పట్లోగా ఆ ప్యాకేజీ ఇస్తారో చెప్పాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ప్రశ్నించారు. రెండు నెలలు దాటిపోయినా ఈ ప్యాకేజీపై ఎలాంటి ప్రకటన వెలువడలేదని అన్నారు. స్పెషల్ ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.

More Telugu News